హనుమంతుడు పూలతో కూడిన పూజ కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్య ఇస్తాడని పండితులు అంటున్నారు. హనుమంతుడికి ఆకుపూజ చేస్తే అనేక గండాలు, ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. హనుమంతుడు ఆకుపూజకు ఇష్టపడడం ఎందుకంటే లంకకు వెళ్లి సీతమ్మవారి జాడను తెలుసుకుంటాడు.
ఆమెకు ధైర్యం చెప్పి శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తరువాత అక్కడి నుండి తిరిగి వచ్చి రాముడిని కలుసుకుని సీతను చూసిన విషయం తెలుపుతాడు. సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి హనుమంతుడి మెడలో వేసి అభినందిస్తాడు. శుభవార్తను తెచ్చినవారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహుకరించడం అప్పట్లే ఒక సంప్రదాయంగా ఉండేది.