నానబెట్టిన పచ్చి శనగపప్పు పెడితే కుటుంబ కలతలు తొలగుతాయి.
తోటకూర, బెల్లం పెడితే ప్రశాంతత లభిస్తుంది.
నానబెట్టిన కందిపప్పు పెడితే రుణ విముక్తి కలుగుతుంది.
నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.
బెండకాయలు పెడితే మనోస్థైర్యం కలుగుతుంది.
నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి.
బీట్ రూట్, పాలకూర పెడితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది
టమోటాలు పెడితే వివాహ ప్రాప్తి కలుగుతుంది.
దోసకాయలు పెడితే శత్రు నివారణ జరుగుతుంది.
అరటి పళ్లు పెడితే ఉన్నత పదవి వరిస్తుంది.
పొట్టు పెసరపప్పు నానబెట్టి పెడితే బుద్ధి కుశలత, విద్యాభివృద్ధి కలుగుతుంది.
నానబెట్టిన బొబ్బట్లు పెడితే ధనాభివృద్ధి లభిస్తుంది.
నానబెట్టిన శనగలు పెడితే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది.