అష్ట... అష్టాదశ... 8కి, 18కి ఎంత ప్రాధాన్యమున్నదో తెలుసుకోండి...
సోమవారం, 30 జనవరి 2017 (20:01 IST)
అష్ట అంటే ఎనిమిది... అష్టాదశ అంటే 18. ఈ 8 అంకెకు, 18 అంకెకూ హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది... మనం పూజించే లక్ష్ములు ఎనిమిదుగురు... అందుకే అష్ట లక్ష్మి అంటారు. అష్టలక్ష్మి: ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి.
అష్టాదశ పీఠాలు:
1. శ్రీ శాంకరీదేవి ( ఎకోమలి , శ్రీలంక )
2. శ్రీ కామాక్షీదేవి (కంచి, తమిళనాడు)
3. శ్రీ శృంఖలాదేవి ( ప్రదుమ్నం, గుజరాత్)
4. శ్రీ చాముండేశ్వరీదేవి ( మైసూరు,కర్నాటక)
5. శ్రీ జోగులాంబాదేవి (అల్లంపురం, ఆంధ్రప్రదేశ్)
6. శ్రీ భ్రమరాంబాదేవి ( శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్)
7. శ్రీమహాలక్ష్మి దేవి ( కొల్హాపూర్, మహారాష్ట్ర)
8. శ్రీ ఏకవీరాదేవి ( నాందేడ్ , మహారాష్ట్ర )
9. శ్రీమహాకాళీదేవి ( ఉజ్జయినీ, మధ్యప్రదేశ్ )
10. శ్రీ పురుహూతికాదేవి (పీఠాపురం, ఆంధ్రప్రదేశ్ )
11. శ్రీ గిరిజాదేవి ( కటక్, ఒరిస్సా)
12. శ్రీ మానిక్యాంబాదేవి ( ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్)