లక్ష్మి అనగానే కేవలం డబ్బు అని అనుకుంటారు చాలామంది. డబ్బు ఒక్కటే కాదు... ఐశ్వర్యం, ఆరోగ్యం, సకల శుభాలు ఎక్కడైతే వుంటాయో అక్కడ లక్ష్మీదేవి వున్నట్లు. లక్ష్మిదేవి కరుణాకటాక్షాలు ఉన్న ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంది. ఐతే లక్ష్మీదేవి ఎటువంటి ఇంటిలో నివాసముంటుంది.. ఏయే పనుల వల్ల భాగ్యలక్ష్మి ఆయా గృహాలను వీడి వెళ్లిపోతుంది. తెలుసుకుందాం.
పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, దీపం, శుభ్రపరిచిన వాకిలి, ద్వారం, గోవులు... ఇవన్నీ లక్ష్మీ రూపాలే.
దేవతారాధన, శుచి, శుభ్రత ఉన్న ఇళ్లలో లక్ష్మీ నివాసముంటుంది.
ప్రాతఃకాల సంధ్యలో, సాయంకాల సంధ్యలో నిద్రపోయే ఇళ్లలో లక్ష్మి ఉండదు.
పెద్దలను గౌరవించే గృహంలో, సహనం కల స్త్రీలు ఉండే ఇళ్లలో లక్ష్మి ఉంటుంది.
రాత్రి కట్టి పడుకున్న బట్టల్ని తిరిగి మరుసటి రోజు ధరిస్తే.. లక్ష్మి వెళ్లిపోతుంది.
ధనం, ధాన్యం, పూజా ద్రవ్యాలు, పెద్దలకు కాళ్లు తగిలితే లక్ష్మికి కోపం వస్తుంది.
ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లో లక్ష్మి ఉండదు.