భక్తిలో తొమ్మది మార్గాలుంటాయి. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన చేయడం, నమస్కరించడం, దాస్యం, సఖ్యం, ఆత్మార్పణ చేసుకోవడం. వీటిల్లో ఏ ఒక్కమార్గాన్ని చిత్తశుద్ధితో అవలంబించినా భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చని బాబా బోధించాడు. భక్తులు పక్షపాతి అయిన శ్రీ షిరిడిసాయి భక్తులకు వచ్చిన కష్టాలను తాను స్వీకరిస్తాని బాబా చెబుతారు.