షిర్డిసాయి, జ్ఞానహినులు బోర్లించిన కుండలు వంటివారు

బుధవారం, 24 జూన్ 2020 (22:19 IST)
షిర్డిసాయిబాబా భక్తులకు ఎన్నో విధాలుగా తన మహిమలు చూపారు. కోపర్గాం స్టేషన్ మాస్టరు వాలంబికి సాయిబాబా యందు విశ్వాసం లేదు. ఇతను ఒకసారి దాసుగణుతో... సాయిబాబా పిచ్చివాడు, మీరు ఎందుకు ఆయన వద్దకు వెళుతున్నారు అని అన్నాడు. 
 
అటు తర్వాత ఒకసారి దాసగణు షిరిడికి వెళుతూ వాలంబిని కూడా తనతో షిరిడికి తీసుకొని వచ్చారు. ఇద్దరూ శ్రీ సాయిబాబావారి దర్శనానికి వెళ్లారు. వారు మసీదుకు వెళ్లినప్పుడు బాబా మట్టిపాత్రలను కడిగి వాటిని నేలపై బోర్లిస్తూ వున్నాడు.
 
వాలంబి అది చూచి, బాబా ఆ మట్టి పాత్రలను ఎందుకు బోర్లా పెడుతున్నారు.? అని ప్రశ్నించాడు. నా వద్దకు వచ్చేవారందరు ఈ పాత్రలవలె అదోముఖంగా వుంటారని బాబా అన్నారు. అంటే తమ వద్దకు వచ్చేవారందరు అజ్ఞానులు గానే వస్తుంటారని బాబా తన అభిప్రాయమును భవగర్భితముగా వివరించారు.
 
ఎవరైతే బాబా వద్దకు ఐహిక కోరికలతో వస్తారో వారు శ్రీ సాయిదేవుని పూర్తిగా గ్రహించలేరని తెలుసుకోవాలి. బాబా వద్దకు జ్ఞానహీనులుగా ఎవరైతే వెళతారో వారందరిని జ్ఞానవంతులుగా చేయుటయే శ్రీ సాయిబాబా మార్గం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు