శుక్రవారం ప్రదోషం... నారదబ్బకాయ రసంతో అభిషేకం..

సెల్వి

శుక్రవారం, 22 మార్చి 2024 (10:02 IST)
శుక్రవారం ప్రదోషం వస్తోంది. ఈ రోజున నందీశ్వరునికి నారదబ్బకాయ రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతుంది. అలాగే శుక్రవారం వచ్చే ప్రదోషాన్ని శుక్ర మహా ప్రదోషం అని పిలుస్తారు. ఈ శుక్రవారం వచ్చే ప్రదోషం రోజున మహేశుడిని పూజించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. 
 
ఫాల్గుణ శుక్లపక్షంలో వచ్చే ప్రదోషం రోజున శివుని ఆరాధనతో అప్పుల బాధలను తొలగించుకోవచ్చు. ఇంకా సంపన్నులు అయ్యే యోగం చేకూరుతుంది. అలాగే శివునికి అభిషేకం కోసం పాలు, పెరుగు, పనీర్ వంటివి అందించవచ్చు. అలాగే తామరపువ్వును శివునికి సమర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
శుక్రవారం శ్రీలక్ష్మికి ప్రీతికరం అయింది. అలా లక్ష్మికి ప్రీతికరమైన తామరను శివునికి సమర్పించడం ద్వారా లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. ఇంకా శివునికి కొబ్బరినీరును అభిషేకానికి ఇవ్వడం ద్వారా వ్యాపారాభివృద్ధి, జీవితంలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. 
 
ప్రదోషంలో ప్రదోష వ్రత పూజ చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. శుక్ర ప్రదోష వ్రతం నాడు జ్యోతిష్యం పరంగా చాలా శుభప్రదంగా భావిస్తున్నారు. నెయ్యి, తేనె, పాలు, పెరుగు,  గంగాజలం మొదలైన వాటితో శివలింగానికి అభిషేకం చేయాలి. ఇది మానసిక అశాంతి తొలగుతుంది. సమస్యలకు పరిష్కాలు లభిస్తాయి.
 
ప్రదోష కాలంలో బిల్వదళాలతో శివునికి పూజ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. తరువాత ప్రదోష వ్రత కథ, శివ పురాణం శ్రవణం చేస్తారు. మహా మృతుంజయ మంత్రం 108 సార్లు పఠిస్తారు. పూజ ముగించిన తరువాత శివాలయానికి వెళతారు. ప్రదోషం రోజు శివాలయంలో ఒక దీపం వెలిగించిన అనేక రెట్ల ఫలితం ఉంటుంది అని భావిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు