పెండ్లివారి ఊరేగింపు ఎదురుగా వస్తే..?

శుక్రవారం, 13 ఫిబ్రవరి 2015 (17:52 IST)
ఎక్కడైనా శుభకార్యమునకు బయలు దేరినప్పుడు పెండ్లివారి ఊరేగింపు ఎదురుగా వస్తే మంగళప్రదము. ఆవులు, ఎద్దులు, నల్లకోతి, కుక్క, జింక ఎదురైతే ధనవృద్ధి. శుభము.
 
కల్లుకుండ, శవము, పక్షులగుంపు ఎదురుగా వస్తే క్షేమము. కార్యసిద్ధి. తేనెపట్టు, తుమ్మెద, చేపలు ఎదురుపడిన మంగళప్రదము.
 
చుంచుల ధ్వని, గుడ్లగూబల ధ్వని వినపడిన ధైర్యము, సంతోషం. కుక్క చెవి విదిలించినట్లైతే శీఘ్రకార్యసిద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి