శివుని అనుగ్రహం పొందిన వస్తువులలో రుద్రాక్ష మాల ఒకటి. దీనివల్ల మానవుని దైనందిన జీవితములో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన కలిగిన ప్రతి ఒక్కరూ ఈ రుద్రాక్షలను ధరించవచ్చు.
ఇవి మన శరీరంపై వున్నప్పుడు కొన్ని అద్భుతాలను సృష్టిస్తాయని విశ్వాసం. మన శరీరంలో ఎక్కువ రసాయన పదార్థాలు వున్నట్లయితే రుద్రాక్ష రంగు మారుతుంది. ఒకవేళ విశేషమైన ఉత్తమ అంశాలు దాగి వుంటే రుద్రాక్ష ముడుచుకుంటుంది. అదే దాని ఉత్తమ లక్షణాలు.