దేవునికి సాష్టాంగ నమస్కారం ఎప్పుడు చేయాలో తెలుసా?

శుక్రవారం, 22 మార్చి 2019 (21:13 IST)
ఎనిమిది అవయవాలతో చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. కేవలం పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీలు చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది. 
 
పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. దేవాలయంలో అయితే ధ్వజస్తంభానికి ఈవల మాత్రమే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. ధ్వజ స్తంభానికి లోపల మాత్రం సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదు.
 
నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు