అయితే మూలవిరాట్టు పాదాల చెంత చిన్న విగ్రహంగా భోగ శ్రీనివాసుడిని దర్శించుకోరు. ఈ భోగ శ్రీనివాసునికి ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రత్యేక అభిషేక ఉత్సవం జరుగుతుంది. తిరుమలలో సహస్ర కలశాభిషేకం బ్రహ్మాండంగా జరుగుతుంది. తగిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భోగ శ్రీనివాసునికి కింద ఓ పీఠం వుంది. ఇందులో శ్రీ యంత్రం వుంది. భోగ శ్రీనివాసుకుని శ్రీదేవి-భూదేవి సమేత మలయప్ప స్వామికి సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. ఆరంభంలో వారానికి ఓసారి జరిగే ఈ అభిషేకం ప్రస్తుతం ఏడాదికి ఒకసారి జరుగుతోంది.
ఈ భోగ శ్రీనివాస విగ్రహం 1400 సంవత్సరాల నాటి ప్రాచీనమైనది. ప్రతిరోజూ శయన మండపంలో ఊంజల్ సేవలో వుండేలా చేస్తారు. ఈ భోగ శ్రీనివాసుడు భక్తుల కోరికలను నెరవేరుస్తాడు. తోమాల సేవలో, ఏకాంత సేవలో భోగ శ్రీనివాస విగ్రహాన్ని ఉపయోగిస్తారు.