మనం ఆలయాన్ని దర్శించినప్పుడు పూజారి శఠగోపనం తల పైన పెడతాడు. దీనిలోని అంతరార్థము ఏమిటి? దేవాలయంలో భగవంతుని దర్శనం అయ్యాక తీర్ధం, శఠగోపనం తప్పనిసరిగా తీసుకోవాలి. చాలామంది దేవుణ్ణి దర్శించుకున్నాక, వచ్చిన పని అయిపోయిందని త్వరత్వరగా వెళ్లి ఏదో ఒక ఏకాంత ప్రదేశం చూసుకుని కూర్చుంటారు.
కొద్దిమంది మాత్రమే ఆగి, శఠగోపనం పెట్టించుకుంటారు. శఠగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా మన కోరికను తలచుకోవాలి. అంటే.... మన కోరికే శఠగోపనం. మానవునికి శత్రువులైన కోమము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవడం మరొక అర్దం.