ఇంట్లో దేవుడి పటాలకు ఎలాంటి పుష్పాలతో పూజిస్తున్నారు?

శనివారం, 23 మే 2020 (21:12 IST)
ఆధ్యాత్మిక ఆసక్తి కలవారు రకరకాల పుష్పాలతో భగవంతుణ్ణి పూజిస్తారు. ఐతే ఈ పుష్పాల్లో కొన్నింటిని కొందరు దేవతలు ఇష్టపడరు. తెలియక చేసిన దానికి పాపమంటకపోయిన మనం చేసే పుణ్యకార్యాన్ని తెలుసుకుని చేయడం ద్వారా ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. ఏ భగవంతుడిని ఏ రకమైన పూలతో పూజించాలో తెలుసుకుందాం.
 
1. గణేశునికి ఎర్రని పూలంటే ప్రీతి. సంకటాలు తొలగడానికి గరికెతో పూజిస్తే మంచిది. వినాయక చవితినాడు తప్ప మరెప్పుడు తులసితో ఆయనను పూజించరాదు.
 
2. సరస్వతి మాతకు తెల్లనిపూలు, జాజిమల్లెలు ఇష్టం. ఆ తల్లిని యా కుందేందు తుషార హార దవళా అని స్తుతించడం గమనించవచ్చు. లక్ష్మీ అమ్మవారికి ఈ పూలే ఇష్టం. ఆ తల్లిని ధవళ తరాంశుక గంధమాల్య శోభాం... అని స్తుతిస్తూ ఉంటాం.
 
3. గాయత్రి, దుర్గ, లలిత అమ్మవార్లకు ఎర్రని పూలు ఇష్టం. అరుణమాల్య భూషాంబరాం, జపాకుసుమ భాసురామ్ అనే స్తుతులు వీటిని నిరూపిస్తాయి. లలితాదేవి పాదాల వద్ద ఎర్రని పుష్పాలు, ఎర్ర రాళ్ల కిరీటం, ఎర్రని ఆభరణాలు, ఎర్రని వస్త్రాలు ఉండటం ఆమెకు ఎరుపు పట్ల గల ప్రీతిని తెలియచేస్తాయి.
 
4. శ్రీమన్నారాయణుణ్ణి కదంబ పుష్పాలతో పూజ చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. అగసి పూలతో పూజ చేస్తే పదివేల యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది.
 
5. శ్రీకృష్ణుడు నీలమేఘశ్యాముడే అయినా నీలిరంగు పూలు ఆయన పూజకు పనికి రావు. పున్నాగ, మందార, కావిరేగు, కచ్చూరాలు, ఒకేఒక్క రెక్క ఉండే పూలు కృష్ణ పూజకు పనికి రావు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు