28-09-2025 ఆదివారం దినఫలితాలు : మానసిక ప్రశాంతత పొందుతారు...

రామన్

ఆదివారం, 28 సెప్టెంబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పనులు హడావుడిగా సాగుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వివాదాలు కొలిక్కివస్తాయి. ప్రయాణం తలపెడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ రోజు గ్రహస్థితి బాగుంది. వ్యవహారదక్షతతో రాణిస్తారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. మానసిక ప్రశాంతత పొందుతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతి విషయంలోను మీదే పైచేయి. ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. గృహమరమ్మతులు చేపడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని విధాల అనుకూలమే. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆత్మస్థైర్యంతో మెలగండి. నిందలు, విమర్శలు పట్టించుకోవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెద్దలతో చర్చలు జరుపుతారు. పాతమిత్రులు తారసపడతారు. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. రుణసమస్య నుంచి బయటపడతారు. కొంతమొత్తం ధనం అందుతుంది, కొత్తపనులు చేపడతారు. ఆందోళనకరమైన సంఘటన ఎదురవుతుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రోజువారీ ఖర్చులే ఉన్నాయి. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుతంది. పిల్లల దూకుడు అదుపుచేయండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై అభిమానం కలుగుతుంది. ఖర్చులు సామాన్యం. బాధ్యతలు అప్పగించవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కుంటారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. శ్రమించినా ఫలితం ఉండదు. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. మొహమ్మాటాలకు పోవద్దు. మొదలెట్టిన పనులు ఒకపట్టాన సాగవు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆలోచనలతో సతమతమవుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. అనవసర జోక్యం తగదు. గృహమరమ్మతులు చేపడతారు. సోదరులతో ఇబ్బందులు ఎదురవుతాయి.

వెబ్దునియా పై చదవండి