దేహానికి సుఖదుఃఖాలనేవి ఉండనే ఉన్నాయి. భగవత్సాక్షాత్కారం పొందినవాడు తన మనస్సు, ప్రాణం, దేహం, ఆత్మ సమస్తాన్ని భగవంతునికి సమర్పిస్తాడు. పంపా సరోవరంలో స్నానం చేయడానికి వెళ్లినప్పుడు రామలక్ష్మణులు తమ ధనుస్సులను నేలలోకి గుచ్చారు. స్నానం చేశాక లక్ష్మణుడు ధనుస్సును తీసి చూసేసరికి దాని కొన రక్తసిక్తమై ఉండటం గమనించాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో తమ్ముడూ... చూడు, చూడు ఏదో ప్రాణి హింసకు గురి అయినట్లుంది అన్నాడు.