యవ్వనం, సౌందర్యం అదృశ్యమవుతాయి... కానీ...

బుధవారం, 6 జూన్ 2018 (21:00 IST)
1. ఏ పని అయితే మనల్ని భగవంతుని వైపు నడిపిస్తుందో అదే మంచి పని. అదే మన బాధ్యత. ఏ పని మనల్ని దిగజారుస్తుందో అది చెడ్డది. అది మన బాధ్యత కానేరదు.
 
2. మానవ జీవిత లక్ష్యం ఇంద్రియభోగం కాదు. జ్ఞాన సాధనమే జీవిత గమ్యం.
 
3. యవ్వనం, సౌందర్యం అదృశ్యమవుతాయి. జీవితం, సంపద మాయమవుతాయి. పేరు, ప్రఖ్యాతి అంతరిస్తాయి. పర్వతాలు సైతం దుమ్ము ధూళిగా మారతాయి. సౌభ్రాతృత్వం, ప్రేమ అంతరిస్తాయి. సత్యం ఒక్కటే శాశ్వతంగా నిలుస్తుంది.
 
4. పవిత్ర జీవనం గడిపేవారు మాత్రమే పరమాత్మ దర్శనం చేయగలరు.
 
5. బలాన్ని స్మరించడమే బలహీనతల నుండి బయట పడే మార్గం. కానీ బలహీనులమని బాధపడటం కాదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు