1. నిజమైన చిత్తశుద్ధితో ఏ పనిలోనైనా నిమగ్నమైతే, మీరు విజయం సాధించడం తధ్యం. సర్వశక్తులనూ సంపూర్ణంగా ధారబోసి పని చేసేవారు విజయాన్ని సాధించడమే గాక అందులో లీనమైపోయి పరమ సత్యాన్నే సాక్షాత్కరించుకుంటారు. మనస్పూర్తిగా ఓ పనిని చేసే వారందరికి సహాయం భగవంతును నుండి లభిస్తుంది.