తొలి రెండు రోజులు మలయప్పస్వామి, దేవేరులు మాత్రమే వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజున మూడు యుగాలను గుర్త్తుచేస్తూ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామికి ఏకకాలంలో అభిషేకం నిర్వహిస్తారు. దాంతో పవిత్సోత్సవాలు ముగుస్తాయి.
అయితే, ఈ యేడాది కరోనా వైరస్ ప్రభావం కారణంగా వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు నిర్వహించే రథోత్సవాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. దానికి బదులుగా సర్వభూపాల వాహనంలో ఉత్సవర్లను కొలువుదీర్చి మండపంలోనే విశేష సమర్పణ నిర్వహించేలా నిర్ణయించారు. మొత్తంమీద శ్రీవారి సేవలు, ఉత్సవాలన్నీ భక్తులు లేకుండానే కేవలం ఆలయ అధికారులు, వేదపండితుల సమక్షంలోనే జరుగుతున్నాయి.