విశ్వకర్మ జయంతి 2024. ఇలాపూజ చేస్తే?

సెల్వి

సోమవారం, 16 సెప్టెంబరు 2024 (11:39 IST)
విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17వ తేదీన వచ్చింది. విశ్వకర్మ దేవతల వాస్తు శిల్పి. విశ్వకర్మ భగవానుడు ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని ప్రతిపద తిథిలో జన్మించాడని చెబుతారు. ఈ రోజును సూర్య సంక్రాంతిగా జరుపుకోవడం ప్రారంభించారు. 
 
విశ్వకర్మ జయంతి రోజున పరిశ్రమలు, కర్మాగారాలు, అన్ని రకాల యంత్రాలకు పూజలు చేస్తారు. సూర్యభగవానుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు భాద్రపద మాసంలో విశ్వకర్మ జయంతిని జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. విశ్వకర్మ ఈ సమయంలోనే జన్మించాడని విశ్వకర్మ విశ్వసిస్తారు.
 
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే లేదా ఇంట్లో సుఖశాంతుల లోపం ఉంటే, ఉదయం స్నానం చేసిన తర్వాత, పూజగదిలో విశ్వకర్మ చిత్రాన్ని ఉంచాలి. తరువాత కలశాన్ని నీటితో నింపి బియ్యం, పండ్లు, పూల మాలలు, గంధం, తమలపాకు, పసుపు ఆవాలు మొదలైన వాటిని సమర్పించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు