శ్రావణ మాసంలో మహిళలు కళకళలాడుతుంటారని అంటారు. అంతేకాదు, పూజలతో పాటు సరదా ఆటలను కూడా ఆడేస్తుంటారు. ఉత్తరాదిలో "దండలు మార్చుకునే శ్రావణ్ మిలన్ ఆట" అనేది శ్రావణ మాసంలో టీనేజ్ ఆడపిల్లలు, మహిళలు ఆడుకునే ఒక సరదా ఆట. శ్రావణ్ మిలన్ అనేది శ్రావణ మాసంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి పండుగ వాతావరణాన్ని ఆస్వాదించడానికి నిర్వహించే ఒక సాంప్రదాయ వేడుక. ఈ వేడుకల్లో భాగంగా అనేక ఆటలు, పాటలు, నృత్యాలు ఉంటాయి.
ఇందులో భాగంగా దండలు మార్చుకునే ఆట కూడా వుంటుంది. ఆటలో పాల్గొనేవారు చిన్న చిన్న పూల దండలు లేదా రంగురంగుల దండలను ముందుగానే తయారు చేసుకుంటారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ ఆటను ఆడవచ్చు. సాధారణంగా ఇది జంటలుగా ఆడే ఆట. ఐతే కొంతమంది మహిళలు ఓ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఒకరి మెడలోని దండను మరొకరు చేతులతో పట్టుకోకుండా వేసుకుంటున్నారు. అదెలాగో ఈ వీడియోలో చూడండి.