ప్రధమ పూజనీయుడు గణేషుడు. అలాంటి గణనాథుడు కలలోకి వస్తే జీవితంలో శుభపరిణామాలు కలుగుతాయని చెబుతున్నారు జ్యోతిష నిపుణులు. జీవితంలో అన్ని అవరోధాలను అధిగమించి అన్ని విజయాలతో ముందుకు సాగుతారని ఆ కల తెలియజేస్తుంది. కనుక వినాయకుడు కలలోకి వచ్చాడంటే ఇక జీవితంలో తిరుగులేదనే అర్థం.