ఆకుల్లో అన్నం తింటే ఏంటి ఫలితం?

గురువారం, 15 జులై 2021 (21:29 IST)
అనేక రకాల పోషకాలు అరటి ఆకులో ఉన్నందున భోజనం అరటి ఆకులో తింటుంటే మంచి రుచిని కలిగిస్తాయి. పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. ఇంటికి వచ్చిన అతిథులకు అరిటాకులో భోజనం పెడతారు.
 
అరటి ఆకులో కానీ విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది. ఫలితంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి లక్ష్మీదేవి కటాక్షo కలుగుతుంది. బాదాం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు.
 
టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది. జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని చెప్పబడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు