పితృపక్షకాలం: భీష్మాచార్యుల గొప్పదనం ఏంటో తెలుసుకుందాం...

బుధవారం, 14 సెప్టెంబరు 2022 (22:54 IST)
మహా పితృపక్షకాలం జరుగుతున్న కాలంలో భీష్మాచార్యుల గొప్పదనం ఏంటో తెలుసుకుందాం... మహాభారతంలో భీష్మ పితామహునిది అత్యున్నతమైన పాత్ర. కురు వంశ పెద్దగా తన ధర్మాన్ని దాటలేక తప్పక కౌరవ పక్షాన నిలిచి చివరికి అంపశయ్య అసువులు బాసిన వారు భీష్ములు. 
 
ఆయన గంగా శంతనుల పుత్రుడు. అసలు దేవ పుత్రుడు. సవతి తల్లి అయిన సత్యవతికి ఇచ్చిన మాట కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. రాచరికాన్ని తుచ్ఛంగా పరిత్యజించిన మహోన్నతుడు. పాండవులందరినీ ఒంటిచేత్తో సంహరించగల అజేయమైన శక్తిమంతుడు భీష్ముడు. 
 
కృష్ణుడంతటివాడు తమ పక్షాన వున్నా భీష్ముని జయించే శక్తి లేక అంబను అడ్డుపెట్టుకుని ఆయనను అంశపయ్య పాలు చేశారు. పాండవులు. యుద్ధంలో రథసారథ్యం తప్ప ఆయుధాలు చేపట్టను అని ప్రతిన బూనిన శ్రీకృష్ణుడు భీష్ముని ప్రతాపాన్ని తాళలేక ఉగ్రుడై రథచక్రాన్ని ఎత్తి భీష్ముని పైకి వచ్చాడు. 
Bheeshma
 
తాను కోరినప్పుడే తనకు చావు రావాలన్న వరం పొందినవాడు భీష్ముడు. నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నా తాను నోరువిప్పనందుకు గాను శిక్షగా 58 రోజులు అంపశయ్యపైనే వున్నాడు. అలాంటి మహిమాన్వితుడిని పితృపక్షం జరుగుతున్న ఈ రోజుల్లో స్మరించుకుందాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు