Shravan Somvar: శ్రావణ సోమవారం ఇలా పూజ చేస్తే సర్వం శుభం

సెల్వి

సోమవారం, 4 ఆగస్టు 2025 (10:14 IST)
పరమ శివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతి రోజూ ఓ దేవుణ్ణి పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. శుక్రవారం మాత్రమే గాకుండా ముఖ్యంగా శ్రావణ సోమవారం శివాలయాలను సందర్శించుకోవడం ద్వారా పుణ్య ఫలితాలు చేకూరుతాయి. 
 
ఇంకా శివాలయాల్లో జరిగే అభిషేకాలు, పూజలు చేయించేవారికి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుందని పురోహితులు చెబుతున్నారు. ఈ మాసం శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో పరమశివుడు, పార్వతిని పూజిస్తారు. దీనితో పాటు శ్రావణ సోమవారం వ్రతం కూడా పాటిస్తారు. 
 
ఈ వ్రతం పెళ్లి కాని యువతీయువకులుకు వివాహంలో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది. ఈ వ్రతం పుణ్యము వలన వ్యక్తి ప్రతి కోరిక నెరవేరుతుంది. శివుని అనుగ్రహం కోసం శ్రావణ సోమవారం కొన్ని ప్రత్యేక వస్తువులతో అభిషేకం చేయండి. దీంతో వివాహ అవకాశాలు పెరుగుతాయని.. కోరుకున్న వరుడు దొరుకుతాడని విశ్వాసం. 
 
తెల్లటి పువ్వులు దేవునికి సమర్పించవచ్చు. శివునితో చంద్రుని అనుబంధం సోమవారాల ప్రాముఖ్యతను పెంచుతుంది. శ్రావణ సోమవారాన్ని ఆచరించడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి, కోరికలు నెరవేరడం, అంతర్గత శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు