కార్యం సిద్ధిస్తుంది. లావాదేవీలతో హడావుడిగా ఉంటారు. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అధికం. మీ శ్రీమతి మాటతీరులో మార్పు వస్తుంది. పనులు మందకొడిగా సాగుతాయి. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అయిన వారు తోడుగా నిలుస్తారు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఒత్తిడి, ఆందోళన అధికం. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి.
ఖర్చులు అధికం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ముఖ్యల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య అకారణ కలహం. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులు ఎదుర్కుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కొత్త పనులు మొదలు పెడతారు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ ఆలోచనలను కొంతమంది నీరుగారుస్తారు.
మీ సామర్ధ్యం ఎదుటివారికి తెలిసివస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. ప్రత్యర్ధులను ఆకట్టుకుంటారు. కీలక బాధ్యతలు చేపడతారు. తొందరపడి హామీలివ్వవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. సేవా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. వాగ్వాదాలకు దిగవద్దు. ఖర్చులు విపరీతం. ఆప్తులు సాయం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. వివాదాలు కొలిక్కివస్తాయి. ప్రయాణం విరమించుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు స్వీకరిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. చేపట్టిన పనులు సాగవు. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. పాత పరిచయస్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది.
మీ ఓర్పునకు పరీక్షా సమయం. ప్రతికూలతలతో సతమతమవుతారు. పెద్దల సలహా పాటించండి. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు.
కష్టించినా ఫలితం ఉండదు చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. తలపెట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. ఆస్తి వివాదాలు సద్దుమణుగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు.