భగవంతుడికి ఏ నూనెతో దీపారాధన చేయాలి?

శనివారం, 26 సెప్టెంబరు 2020 (18:16 IST)
భగవంతుడికి దీపారాధన చేయడం పూజ చేసేటపుడు చేస్తుంటాం. ఐతే ఈ దీపారాధనకు ఏ నూనెను ఉపయోగించాలన్నది చాలామందికి తెలియదు. కానీ దీపారాధనకు ఆవునెయ్యి ఉత్తమం అని చెప్పబడింది. అలాగే మంచి నూనె మధ్యమము. ఇప్పనూనె అధమము.
 
ఆవు నెయ్యితో వెలిగించిన దీపం యొక్క ఫలితము అనంతము. అష్టైశ్వరాలూ, అష్టభోగాలు సిద్ధిస్తాయి. వెండి లేదా పంచలోహాలతోనూ, మట్టితో చేసిన దీపాలు అత్యుత్తమము. వేరుశెనగ నూనెతో దీపారాధన చేయరాదు. శ్రీమహాలక్ష్మికి ఆవునెయ్యి దీపం, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము చాలా ఇష్టము.
 
కనుక భగవంతునికి దీపారాధన చేసేటపుడు ఖచ్చితంగా ఏ నూనె వాడాలన్నది తెలుసుకుని చేయాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు