కుగ్రామంలోని కనీఫ్‌నాథ్ పుణ్యస్థలం

WD PhotoWD
ఈ వారం తీర్థయాత్రలో 'నథ్' సమాజానికి చెందిన 'నథ్ గురు' ఆలయాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. మహారాష్ట్రలోని 'మది' అనే కుగ్రామం ఉంది. ఇక్కడ కనీఫ్‌నాథ్ ఆలయం వెలసివుంది. కనీఫ్‌నాథ్ మహారాజ్ ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం పౌణగిరి నదీతీరంలో వుంది. గత 1710వ సంవత్సరం ఫాల్గుణ మాస, పంచమి రోజున కనీఫ్‌నాథ్ మహారాజ్ జీవసమాధి చెందారు. ఈ ఆలయానికి మూడు ప్రవేశ ముఖ ద్వారాలు ఉన్నాయి. భక్తులకు మనశ్శాంతిని చేకూర్చే ఈ ఆలయానికి విదేశీ పర్యాటకులు సైతం వస్తూ పోతుంటారు.

ఆలయ చరిత్ర...
మొఘల్ సామ్రాజ్యం, ఔరంగజేబు పరిపాలన కాలంలో కారాగారవాసం అనుభవిస్తున్న తన భర్త మహారాజ్ ఛత్రపతి షాషూను విడుదల చేయాలని కనీఫ్‌నాథ్‌ను రాణి ఏసుభాయ్ వేడుకుంది. ఆమె ప్రార్థన ఫలించి ఈ స్థలంలో ఆలయం ఏర్పాటైందని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయ నిర్మాణ పనుల్లో ఆ ప్రాంతానికి చెందిన దళితులు పెద్ద ఎత్తున పాలుపంచుకున్నారు. ఈ కారణంతోనే ఆలయ స్వామిని "పందారి"గా అనే పేరుతోనే పిలువబడుతోంది.

తదనంతరం కాలక్రమేణా శ్రీ కనీఫ్‌నాథ్‌ స్వామివారిని ఆ ప్రాంత ప్రజలు తమ కులదైవంగా పూజించడం ప్రారంభించారు. హిమాలయాల్లో పుట్టి పెరిగిన కనీఫ్‌‌నాథ్, కారడవిలో ఘోర తపస్సు చేశాడు. పలు సంవత్సరాలుగా ఈ తపస్సు చేశాడు. అతీతశక్తులను తన వశం చేసుకున్న కనీఫ్‌నాథ్ పేద ప్రజలకు ఆధ్యాత్మిక అంశాలు ఉపదేశించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రజలకు ఆధ్యాత్మిక ఉపదేశాలు చేస్తూ, ప్రజల కష్ట నష్టాలపై కవితలుగా రచించడం ప్రారంభించారు. కనీఫ్ తన రచనల్లో పేద ప్రజల కష్టాలను ప్రధానంగా ప్రస్తావించే వారు.

WD PhotoWD
కనీఫ్‌నాథ్ ఆలయంలో దానిమ్మ చెట్టు ఒకటి ఉండేది. ఈ వృక్షానికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి, ఆరాధించేవారు. ఈ వృక్షం కనీఫ్‌నాథ్ భక్తురాలు ధాలీభాయ్ స్మారకంగా వెలసిందని ఆలయ నిర్వాహకులు అంటున్నారు. కనీఫ్‌నాథ్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ భక్తురాలు ఇక్కడే జీవసమాధి అయ్యేందుకు నిర్ణయించుకున్న సమయంలో కనీఫ్‌నాథ్ దర్శనమిచ్చి దానిమ్మ వృక్షంగా ఎల్లప్పుడూ జీవంతో ఉండాలని ఆశీర్వదించినట్టు ఇక్కడి భక్తులు చెపుతుంటారు.

ఈ కారణంతోనే కనీఫ్‌నాథ్ ఆలయంలో దానిమ్మ వృక్షం వెలసిందని స్థానికుల విశ్వాసం. కనీఫ్‌నాథ్ ఆలయంలో మరో విశేషమేమిటంటే.. సమీపంలోని గ్రామాల్లో తలెత్తే సమస్యను పరిష్కరించే పంచాయతీ మందిరంగా కనీఫ్‌నాథ్ దేవాలయం వేదికగా నిలుస్తోంది. అంతేకాకుండా సమస్యలకు తగిన రీతిలో పరిష్కరించి సరైన తీర్పు వస్తుందని నమ్మకం ఇక్కడి స్థానికుల నమ్మకం.

ఇక్కడకు ఎలా చేరుకోవాలి...
రోడ్డు మార్గం ద్వారా.. మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్‌నగర్ జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం వెలసి వుంది. అహ్మద్‌నగర్ నుంచి బస్సు లేదా టాక్సీల ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం ద్వారా.. ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అహ్మద్‌నగర్‌.

విమానమార్గం ద్వారా.. అహ్మద్‌‌నగర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో పూణె విమానశ్రయం ఉంది.