ఖాండ్వా భవానీ మాత ఆలయం

ఆదివారం, 8 జూన్ 2008 (15:51 IST)
WD PhotoWD
ఈవారం తీర్థయాత్రలో మిమ్మల్ని ఖాండ్వాలోని భవాని మాత వద్దకు తీసుకెళుతున్నాం. ఈ దేవాలయం ప్రసిద్ధిగాంచిన ధునివాలె దాదాజీ మందిరానికి సమీపంలో నెలకొని ఉంది. శ్రీరామచంద్రమూర్తి కాలంలో ఆయన ఈ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహించినట్లు చెపుతారు. కనుకనే నవరాత్రి సందర్భంగా ఇక్కడ తొమ్మిది రోజులు ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా, ఈ ఉత్సవంలో వేలమంది భక్తులు పాల్గొని భవాని మాతను సందర్శించుకుని తరిస్తారు.

గర్భగుడిలో వెండితో తాపడం చేయబడిన చెక్కడాలు కనిపిస్తాయి. అదేవిధంగా విగ్రహం కిరీటం, మాతపైనున్న గొడుగు కూడా వెండితోనే చేయబడ్డాయి. పూర్వం భవానీ మాతను నాకటి( చదునైన ముక్కు కలది) అని పిలిచేవారు. అయితే దాదాజీ ధునివాలి తర్వాత మాతను భవానీగా భక్తులు పిలవటం ప్రారంభించారు.

దేవాలయ ప్రాంగణం ఎంతో ఆహ్లాదకరంగా ఆధ్యాత్మిక భావాలను కలిగిస్తుంది. దేవాలయ ముఖ భాగంలో ఉన్న స్తంభాలు శంఖు ఆకారంలో ఉన్నాయి. అదేవిధంగా ఆలయంలో శంఖు ఆకారంలోనే ఓ పెద్ద లైటు ఉంది.

భవానీ మాత ఆలయానికి సమీపంలో శ్రీరాముని ఆలయం, తుల్జేశ్వర్ హనుమంతుని ఆలయం, తుల్జేశ్వర్ మహదేవ్ ఆలయం ఉన్నాయి. ఈ దేవాలయంలో
WD PhotoWD
దేవదేవుల విగ్రహాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. భక్తులు కోరికలు తీర్చే మాతగా తులజా భవానీ పూజలందుకుంటోంది. ఒక్కసారి మాతను సందర్శించుకుంటే మదిలోని కోరికలు తప్పక నెరవేరతాయి.

చేరుకోవటమెలా: ఖాండ్వాకు అన్ని ప్రధాన పట్టణాల నుంచి రోడ్డు, రైలు సౌకర్యం వుంది. దేవి అహల్య విమానాశ్రయం ఖాండ్వాకు సమీపంలో వున్న ఎయిర్‌పోర్టు. ఇది ఇండోర్ నుంచి 140 కి.మీ దూరంలో వున్నది.