పురాతన శైవ క్షేత్రం.. సోమనాథ్ ఆలయం

WD PhotoWD
మన దేశంలోని పుణ్యక్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలలోని సోమనాథ్ జ్యోతిర్లింగం గురించి ఈ వారం తీర్థయాత్రలో దర్శిద్దాం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటదైన సోమేశ్వర లింగం మిక్కిలి ప్రఖ్యాతి చెందిన పురాతనమైన శైవ క్షేత్రం . పశ్చిమ భారతదేశంలో గుజరాత్ రాష్ట్రం (సౌ రాష్ట్రం) లోని ప్రభాస పట్టణంలో నెలకొని ఉన్నది. స్కదపురాణం, శ్రీమద్భాగవత్, శివపురాణాలలోని ఆనవాళ్లు ఈ తీర్థయాత్రలో మనకు దర్శనమిస్తాయి. సరస్వతీ నదీ సాగర సంగమం చేసే ఈ పవిత్ర స్థలంలో సోమనాథుని దర్శనం ఎంతో పుణ్యప్రదమైనదిగా ఋగ్వేదంలో చెప్పబడింది.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథుని ఆలయంపై ఆరుసార్లు ముస్లిం దాడులు జరిగాయి. ఫలితంగా ఆ దేవాలయం భిన్నత్వంలో ఏకత్వాన్ని తలపింపజేస్తుంది. దాడుల తర్వాత మహమేరు ప్రసాద్ పద్ధతిలో ఆలయాన్ని నిర్మించటం జరిగింది. భారతదేశ ఉక్కుమనిషి సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రస్తుత ఆలయానికి మార్గదర్శకులని చెప్పవచ్చు.

గర్భగుడి, సభామండపం, నృత్య మండపాలతో కూడుకుని ఉన్న ఈ ఆలయం శిఖరం ఎత్తు 150 అడుగుల ఎత్తులో ఉంటుంది. శిఖరానికి అగ్రభాగాన విరాజిల్లే కలశం బరువు 10 టన్నులు. అంతేకాదు అడుగు వెడల్పుతో 27 అడుగుల ఎత్తులో ఆలయ ధ్వజస్తంభం గోచరిస్తుంది.
WD PhotoWD


పురాణంలో...
సోమనాథునికి మరో పేరు చంద్రుడు. సోముడు దక్షిణుని అల్లుడు. ఓ రోజున దక్షిణుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. దీన్ని అల్లుడైన సోమనాథుడు అమలు చేయకపోవడంతో మామ ఆగ్రహం చెంది, శపిస్తాడు. అప్పటి వరకు ప్రతి రాత్రి ప్రకాశవంతమైన కాంతిని (వెన్నెల) వెదజల్లిన చంద్రుడు.. ఆ రోజు నుంచి కొద్దికొద్దిగా మాయం కావడం ఆరంభమై.. ఒక రోజు పూర్తిగా కనిపించకుండా పోతాడు. దీంతో ముక్కోటి దేవతలు ఏకమై శాపాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా దక్షిణుని వేడుకున్నారు.

WD PhotoWD
దేవతల ప్రార్థనతో కరుణించిన దక్షిణుడు.. సోమనాథుడుని సరస్వతి నది సముద్రంలో కలిసే ప్రాంతానికి వెళ్లి స్నానమాచరించి శాప విముక్తి పొందాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆ ఆజ్ఞ ప్రకారం సోముడు నడుచుకుని శివుని ప్రార్థించిన ప్రాంతమే సోమనాథ ఆలయంగా ఖ్యాతిగడించింది. అందువల్లే చంద్రడుని ఇక్కడ శివపెరుమాళ్ సోమనాథుడు అనే పేరుతో కూడా పిలుస్తుంటారు.

ఎలా వెళ్లాలి..
విమానమార్గం... దేశ వాణిజ్య రాజధాని ముంబై నుంచి కేసోడ్‌కు చేరుకోవాలి. సోమనాథ్‌తు దగ్గరలో ఉండే విమానశ్రయం కేసో‌డ్ మాత్రమే. ఈ రెండు ప్రాంతాల మధ్య 55 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతేకాకుండా.. ఈ రెండు ప్రాంతాల మధ్య బస్సులు, టాక్సీ రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

రైలు మార్గం ద్వారా... సోమనాథ్‌కు ఏడి కిలోమీటర్ల దూరంలో ఉండే రైల్వే స్టేషన్ వెరవల్. గుజరాత్‌ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌తో పాటు.. మరికొన్ని ప్రాంతా
WD PhotoWD
నుంచి ఇక్కడకు రైలు సర్వీసులు ఉన్నాయి.

రోడ్డు మార్గం ద్వారా... ఈ ప్రాంతానికి రాష్ట్ర రవాణా సంస్థతో పాటు.. ప్రైవేటు సంస్థలు ప్రతినిత్యం బస్సు సర్వీసులను నడుపుతున్నాయి. సోమనాథ్‌కు ముంబై (889 కిలోమీటర్లు), అహ్మదాబాద్ (400 కిమీ), భావాంగర్ (266 కిమీ), జునాగర్హ్ (85 కిమీ), పోర్‌బందర్ (122 కిమీ), వెరవల్ తదితర ప్రాంతాల నుంచి మంచి రోడ్డు మార్గం ఉంది.

బస-వసతి సౌకర్యం... సోమనాథ్‌లో పేరొందిన హోటల్స్‌ మీకు అందుబాటులో లేవు. అయితే.. అతిథి గృహాలు, విశ్రాంతి గృహాలు మాత్రమే భక్తులు, పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ సాధరణ సౌకర్యాలు అందుబాటులో ఉండగా, ధరలు కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి.