ప్రకృతి ఆరాధించే మా చంద్రికాదేవి ధామ్ దేశంలో ప్రసిద్ధి గాంచిన పుణ్య స్థలాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు సమీపంలో ఉన్న పక్షికా తలాబ్ (పక్షుల నివాస కేంద్రం)కు 11 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం వెలసివుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న వేప చెట్టు కింద వెయ్యి సంవత్సరాలకు చెందిన పురాతమైన దుర్గాదేవి విగ్రహం కొలువైవుంది.. మహీ సాగర్ సంగమ క్షేత్రానికి సమీపంలో ఈ ఆలయం వుంది.
18వ శతాబ్ది మధ్య కాలంలో ప్రతి పౌర్ణవి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు పురాణాలు చెపుతున్నాయి. ఆ పద్ధతి నేటికి ఆచరిస్తున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులు తమ కోర్కెలు నెరవేరడం కోసం ఎరుపు రంగు వస్త్రాన్ని వేప చెట్టుకు కడుతారు. కోర్కెలు తీరిన తర్వాత మళ్లీ ఆలయానికి వచ్చి ఎరుపురంగు వస్త్రాన్ని విప్పేస్తారు. అనంతరం తమ ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేసి, ప్రసాద నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ పిమ్మట ఆలయం అభివృద్ధి కోసం తమ కిష్టమైన పనులను చేస్తారు. ఈ ఆలయంలో కొబ్బరి కాయ కొట్టడంతో పాటు ఇతర పూజలను నిషేధించారు.
మా చంద్రికాదేవి ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరు సమానం. ఈ ఆలయ పరిపాలనా నిర్వహణను పూర్తిగా అఖిలేష్ సింగ్ అనే వ్యక్తి చూస్తుంటారు. మహీ సాగర్ సంగమానికి ఉన్న ప్రధాన పూజారుల్లో ఒకరు. ఇక్కడకు వచ్చే మధ్యతరగతి ప్రజలు భైరవుని దర్శించుకుంటారు. అన్ని మతాలు, కులాల వారిని ఒక చోటకు చేర్చే
WD Photo
WD
పవిత్ర పుణ్య స్థలంగా మా చంద్రికా దేవి ధామ్ పేరుగాంచింది.
స్కందపురాణంలో కనిపించే ఘటోత్కజుని కుమారుడు బార్బరిక్ ఇక్కడ పూజలు చేసినట్టు చరిత్ర చెపుతోంది. చంద్రికా దేవి ధామ్ ఆలయానికి ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో గోమతి నది ప్రవహిస్తోంది. అలాగే మహీ సాగర్ సంగమం ఈ ప్రాంతానికి తూర్పు ప్రాంతంలో వెలసివుంది. అయితే ఈ ప్రాంతానికి నీరు వల్ల ఎలాంటి ఉపద్రవం సంభవించింది లేదు. ముఖ్యంగా ఈ ప్రాంతం నేరుగా పాతాళగంగతో అనుసంధానమై ఉన్నట్టు ఇక్కడి భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఇక్కడకు వచ్చే భక్తులు బార్బరిక్‌ను కూడా పూజించి వెళుతుంటారు.
WD Photo
WD
మహీ సాగర్ సంగమంలో భక్తులు స్నానమాచరించిన తర్వాతే చంద్రుని దర్శించుకుంటారు. ఇక్కడే తక్ష ప్రజాపతి శాప విముక్తుడైనట్టు భక్తుల విశ్వాసం. పురాణ కాలంలో లక్ష్మణ్ - ఊర్మిళకు జన్మించిన చంద్రకేతు అమవాస్య రోజున కారడవిలో చిక్కుకున్నాడు. ఆ సమయంలో నవ దుర్గా మాతను ప్రార్థిస్తూ పూజలు చేయగా, మా చంద్రికా దేవి ప్రత్యక్షమై, చంద్రకేతు మనస్సులోని భయాన్ని పోగొట్టినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.
మహాభారతంలో కూడా పాండవులు ద్రౌపదిని వెంటబెట్టుకుని వనవాసానికి వెళ్లినపుడు ఈ ప్రాంతానికి వచ్చినట్టు పురణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా ఈ ఆలయం వెనుక ఒక మూఢ నమ్మకం కూడా ప్రచారంలో ఉంది. యుధిష్టురుడు, హాన్స్‌రాజ్ అనే ఇద్దరు రాజుల మధ్య జరిగిన యుద్ధంలో హాన్స్‌రాజ్ కుమారుల్లో ఒకరైన సుంధన్వా మాత్రం ఈ పోరుకు దూరంగా ఉన్నారు.
ఆ యుద్ధ సమయంలో సుంధన్వా నవ దుర్గా పూజల్లో నిమగ్నమయ్యాడు. దీన్ని జీర్ణించుకోలేని రాజు హాన్స్‌రాజ్ తన కుమారుడిని కాగే వేడి నూనెలో వేయాల్సిందిగా భటులను ఆదేశిస్తాడు. రాజు ఆదేశం మేరకు సేవకులు సుంధన్వాను కాగుతున్న నూనెలో వేస్తారు. అయితే మా చంద్రికా కృపా కటాక్షాలతో సుంధన్వా ప్రాణాలతో బయటపడతాడు.
ఈ సంఘటన తర్వాత ఈ ప్రాంతానికి సుంధన్వా కుండ్ అనే పేరు వచ్చింది. అలాగే.. యుధిష్టురుడు తన సేనలతో నివశించిన ప్రాంతానికి ప్రస్తుతం కటక వాసా అనే
WD Photo
WD
పేరు వాడుకలో ఉంది. ఇలాంటి ప్రసిద్ధ పురాణ గాథలు కలిగిన ఈ ప్రాంతంలో హావన్ కుండ్, యాగశాల, చంద్రికా దేవి న్యాయస్థానం, బార్బిరిక్ ప్రవేశద్వారం, సుధన్వా కుండ్, బ్యాంక్ ఆఫ్ మహి సాగర్ సంగమాలు ఉన్నాయి.
హిందు మతానికి చెందిన ప్రముఖ రచయితల్లో ఒకరైన దివంగత అమ్రిల్లాల్ నగర్ రాసిన 'కర్వట్' అనే పుస్తకంలో ఈ పుణ్యస్థలం గురించి ప్రత్యేకంగా వివరించారు. ఇక్కడ నివశించే భక్తులు ఈ ప్రాంతాన్ని చారిత్రాత్మక ప్రదేశంగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.