శ్రీ లక్ష్మీ నరసింహునికి చందనోత్సవం

ఆదివారం, 11 మే 2008 (15:54 IST)
WD PhotoWD
భక్తుల ప్రార్థనలతో సింహాచల క్షేత్రం మారుమోగుతోంది. వైశాఖమాసంలో మూడోరోజు అక్షయ తృతీయ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు సింహాచలేశుని దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమాన్ని కనులారా చూసి తరించారు. ఏడాదిలో ఈ రోజు మాత్రమే స్వామివారు నిజరూప దర్శనమివ్వటం మరో విశేషం. స్వామివారు కొలువై ఉన్న ఈ దేవాలయాన్ని క్రీ.శ 11 శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. సింహాచలం అంటే సింహాచలమనే కొండకు రారాజు అయిన సింహాచలేశుడు విష్ణుమూర్తి నాలుగో అవతారం. తన భక్తుడు ప్రహ్లాదుని కాపాడేందుకు స్వామివారు కొండపైకి వేంచేశాడు.

స్థలపురాణాన్ననుసరించి కొండపై వెలిసిన నరసింహునికి ప్రహ్లాదుడే గుడి కట్టించాడని తెలుస్తోంది. నరసింహస్వామిచే హిరణ్యకశ్యపుడు సంహరించిన అనంతరం ఈ శుభకార్యాన్ని ప్రహ్లాదుడు ప్రారంభించాడు. అయితే కృతయుగం ఆఖరికి వచ్చేసరికి దేవాలయ బాగోగులు పట్టించుకునేవారు లేక శిథిలావస్తకు చేరుకుంది.
WD PhotoWD
నరసింహుని విగ్రహం చుట్టూ మట్టి పుట్టలుగా చేరిపోయింది. అయితే పురూరవుని కాలంలో తిరిగి సింహాచల దేవాలయం వెలుగులోకి వచ్చింది.

పురూరవుడు ఓసారి ఊర్విశితో గగన విహారం చేస్తుంటాడు. అలా విహారం చేస్తూ... సింహాచల కొండ దక్షిణ భాగానికి రాగానే ఏదో తెలియని శక్తి ఉన్నట్లు అతనికి గోచరిస్తుంది. ఈ పరిణామంతో సింహాచల గిరిపై దిగిన పురూరవునికి మట్టిపుట్టలమధ్య పూడుకుపోయి ఉన్న స్వామివారి విగ్రహాన్ని కనుగొంటాడు. ఆ మట్టిని తొలగిద్దామనుకున్న పురూరవునికి ఆకాశవాణి హెచ్చరిక వినబడుతుంది. స్వామివారి చుట్టూ ఉన్న మట్టిని తొలగించవద్దనీ... అయితే చందనంతో కప్పివేయమని చెపుతుంది.

WD PhotoWD
అంతేకాదు... ఈ రూపంలోనున్న స్వామివారు ఏడాదికోసారి మాత్రమే పూజింపబడాలనీ... అదీ వైశాఖమాసంలో వచ్చే మూడో రోజున స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలని చెపుతుంది. ఆకాశవాణి ఆదేశానుసారం పురూరవుడు స్వామివారిని చందనంతో అలంకరించటంతోపాటు ఆలయాన్ని కూడా నిర్మిస్తాడు. అప్పటినుంచి దేవాలయం నిత్యం పూజలందుకుంటూనే వుంది.

ఆలయ ప్రాముఖ్యత
ప్రపంచ పురాతన దేవాలయాల్లో సింహాచల క్షేత్రం ఒకటి. సముద్రమట్టానికి సుమారు 800 అడుగుల ఎత్తులో ఉన్న సింహాచలం... విశాఖకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింహాచలేశుని సందర్శనకు కొండపై వెళుతున్న మనకు పైన్ ఆపిల్, మామిడి తదితర వృక్షాలు కనబడతాయి. కొండపైకి కాలినడకన వెళ్లే భక్తులకు వృక్షాలు తమ చల్లని గాలులతో సేదతీరుస్తాయి. మార్గమధ్యంలో ఉన్న మెట్లను భక్తుల సౌకర్యానికి అనుకూలంగా మలిచారు. ముఖ్యంగా శని,
WD PhotoWD
ఆదివారాల్లో స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. ఏప్రిల్ నుంచి జూన్ మాసం వరకూ భక్తుల సందర్శన కాస్త ఎక్కువగా ఉంటుంది. మార్చి లేదా ఏప్రిల్‌లో చైత్ర శుద్ద ఏకాదశినాడు నిర్వహించే వార్షిక కాల్యాణం, ఏప్రిల్ లేదా మే నెలలో వైశాఖమాసం మూడోరోజు నిర్వహించే చందనయాత్ర అతి ముఖ్యమైన ఉత్సవాలు.


చేరుకోవటమెలా
రోడ్డు ద్వారా.... హైదరాబాదు నుంచి విశాఖపట్టణం 650 కిలోమీటర్లు... అదే విజయవాడ నుంచైతే 350 కిలోమీటర్ల. హైదరాబాదు, విజయవాడ, తిరుపతి, చెన్నైల నుంచి బస్సు సౌకర్యం ఉన్నది.

రైలు ద్వారా... విశాఖపట్టణం ప్రధాన రైలు జంక్షన్, కనుక అన్ని నగరాలనుంచి దాదాపు ఇక్కడకు రైలు సౌకర్యం ఉన్నది. న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతాల నుంచి ప్రతి రోజూ రైలు సౌకర్యం ఉన్నది. ఇక ఇండియన్ ఎయిర్ లైన్స్ సర్వీసులు ఇతర ప్రైవేటు విమాన సర్వీసులు హైదరాబాదుకు ఉన్నాయి.