శ్రీవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు..

బుధవారం, 17 ఏప్రియల్ 2019 (17:29 IST)
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో నేటి నుండి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వసంత మండపాన్ని మరింత సుందరంగా ముస్తాబు చేశారు.


అందులో భాగంగా గురువారం నాడు తిరుమలలో రథోత్సవం జరగనుంది. కాగా వసంతోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు తిరుమలలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు.
 
ఇదిలా ఉంటే ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 10 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. అయితే మంగళవారం శ్రీవారిని 81,413 మంది భక్తులు దర్శించుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు