ప్రతికూలతలు అధికం. రోజులు భారంగా గడుస్తాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. దుబారా ఖర్చులు విపరీతం. కొత్త సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఖర్చులు అదుపులో ఉండవు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. దైవకార్యంలో పాల్గొంటారు. దూరపు బంధువులు తారసపడతారు.
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పనులు వేగవంతమవుతాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. అనుకోని సంఘటన ఎదురవుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సర్వత్రా కలిసివచ్చే సమయం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. పిల్లల దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలించవు. నిస్తేజానికి లోనవుతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సన్నిహితుల ప్రోత్సహిస్తారు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పనులు ముందుకు సాగవు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త.
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఖర్చులు విపరీతం. చేసిన పనులే చేయవలసి వస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. నోటీసులు అందుకుంటారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. నోటీసులు అందుకుంటారు. న్యాయనిపుణులను సంప్రదిస్తారు. ఆత్మీయుల సలహా పాటించండి. ప్రయాణం తలపెడతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాలను సమర్ధంగా నడిపిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభకార్యం తలపెడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆపన్నులకు సాయం అందిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు.
అనుకూలతలున్నాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు.
కలుపుగోలుగా వ్యవహరిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ధార్మిక విషయాలపై దృష్టి పెడతారు. ప్రియతముల రాక ఉత్సాహాన్నిస్తుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులు ఫలించవు. మీ తపిదాలను సరిదిద్దుకోండి. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.