అయోధ్యలో తొలి నవరాత్రి ఉత్సవాలు.. రామ్ లల్లా కోసం కొత్త దుస్తులు

సెల్వి

మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (11:09 IST)
రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత అయోధ్య ఆలయంలో జరిగే తొలి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మంగళవారం చైత్ర నవరాత్రుల మొదటి రోజు నుండి ప్రారంభమై, శ్రీరాముని జన్మదినమైన రామ నవమి వరకు, ఏప్రిల్ 17న రామ్‌లల్లా విగ్రహానికి ప్రతిరోజూ కొత్త దుస్తులు ధరించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. 
 
ఆలయ ట్రస్ట్ రామ్ లల్లా కోసం తయారు చేసిన దుస్తులకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో అప్‌లోడ్ చేసింది. కొత్త దుస్తులు ప్రత్యేకమైన చేతితో నేసినవి. ఖాదీ పత్తితో తయారు చేయబడ్డాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉన్నందున, ఆలయానికి సెల్‌ఫోన్లు తీసుకురావద్దని ట్రస్ట్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
 
"భక్తులు రామ్ లల్లా యొక్క శీఘ్ర దర్శనం కావాలనుకుంటే, వారు రామమందిరం వద్దకు తిరిగే ముందు వారి సెల్ ఫోన్లు మరియు షూలను వేరే ప్రదేశంలో ఉంచాలి. ఇది సమయం ఆదా అవుతుంది. క్యూలో త్వరిత కదలికను నిర్ధారిస్తుంది" అని ట్రస్ట్ అధికారి చంపత్ రాయ్ చెప్పారు. ఇంకా రామనవమి ఉత్సవాల కోసం భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు చంపత్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు