తెలుగు భాషపై తనకు పూర్తిపట్టు ఉందన్నారు నూతన టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్. ఎపి క్యాడర్‌లో పనిచేసిన తాను తెలుగు రాయగలనని, తెలుగు చదవగలనని, తెలుగు ఫైళ్ళపై సంతకం పెట్టగలనన్నారాయన. తన పోస్టింగ్ పైన మాట్లాడనంటూనే స్వామివారి చెంత ఈఓగా అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని తితిదే ఈఓ ఒక టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.