తిరుమలలో కనిపించింది పాక్ జెండా కాదు - హథీరాంజీ పీఠాధిపతి అర్జున్‌ దాస్‌

సోమవారం, 16 మే 2016 (22:24 IST)
తిరుమలలోని జపాలీ తీర్థం సమీపంలో కనిపించిన జెండా పాక్ మతానికి చెందింది కాదన్నారు తిరుపతికి చెంది హథీరాంజీమఠం పీఠాధిపతి అర్జున్‌ దాస్‌. మహబూబ్‌ నగర్‌కు చెందిన ఒక ఆంజనేయ భక్తుడు ఈ జెండాను తీసుకువచ్చారని చెప్పారు అర్జున్‌ దాస్‌. ఆ వ్యక్తి తమ మఠానికి కూడా వచ్చారని, ఆంజనేయస్వామి అంటే ఆయనకు ఎంతో ఇష్టమని మీడియాకు చెప్పారు. 
 
అందుకే తిరుమలలోని జపాలీ తీర్థానికి కారులో వెళ్ళారని తెలిపారు. అందరు అనుకున్నట్లుగా ఆ జెండా పాక్ దేశానిది కాదన్నారు.  ఈ విషయంపై తితిదేకు కూడా ఆయన ఒక లేఖ రాశారు. అయితే తితిదే ఉన్నతాధికారులు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి