కష్టం ఫలిస్తుంది. ఖర్చులు సామాన్యం. మీ జోక్యం అనివార్యం. సామరస్యంగా సమస్యను పరిష్కరిస్తారు. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో ఒత్తిడి అధికం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి.
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు.
శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. యత్నాలు కొనసాగించండి. పనులు పురమాయించవద్దు. ఖర్చులు విపరీతం. ధనసహాయం ఆశించి భంగపడతారు.
అనుకూలతలున్నాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ధనలాభం ఉంది. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. కొత్త పనులు చేపడతారు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ఆలయాలు సందర్శిస్తారు.
లావాదేవీలు ముగుస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. దుబారా ఖర్చులు విపరీతం. కీలక పత్రాలు అందుకుంటారు. దైవ మహోత్సవ సమావేశంలో పాల్గొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వివాహయత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో ఏకాగ్రత వహించండి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ముఖ్యమైన పనులు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి.
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యవహారాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. అనవసర జోక్యం తగదు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
బంధువుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. స్వయంకృషితో లక్ష్యం సాధిస్తారు. విలాసాలకు వ్యయం చేస్తారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు.
మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. నోటీసులు అందుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారాలతో సతమతమవుతారు. ఖర్చులు సామాన్యం. మీ ఆలోచనలను కొంతమంది నీరుగారుస్తారు. గుంభనంగా మెలగండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు.