అనంతరం గోమాత, దూడకు అర్చకుల మంత్రాల నడుమ నూతన వస్త్రాలు, పూలమాలలు వేసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం గోమాత, దూడకు ప్రదక్షిణలు చేసి హారతి ఇచ్చారు. గోమాత పాలు పితికి వాటిని తీసుకుని వెళ్ళి అర్చకులకు అందించి అభిషేకం చేయించారు.
తిరుమలలోని గోగర్భం డ్యాం చెంత ఉన్న ఉద్యావనంలో కాళీయమర్ధనుడు అయిన చిన్నిక్రిష్ణునికి ప్రత్యేక పూజలు జరిపారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, కుంకుమ, చందనం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు.