నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం

గురువారం, 18 నవంబరు 2021 (09:36 IST)
తిరుమలలోని శ్రీవారి ఆలయంలో గురువారం కార్తీక దీపోత్సవం జరుగనుంది. దీన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం, ఉప ఆలయాల్లో నేతి ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా రాత్రి గరుడ వాహనసేవ నిర్వహిస్తారు.
 
శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తైన తర్వాత దీపోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు... నేతి వత్తులతో దీపాలు వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలోని శ్రీవారికి హారతి ఇస్తారు. 
 
అనంతరం గర్భాలయం, ఉప ఆలయాల్లో దీపాలు వెలిగిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను తితిదే రద్దు చేసింది.కార్తిక పౌర్ణమి సందర్భంగా రాత్రి గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. గరుడవాహనంపై ఊరేగుతూ శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు