సంపూర్ణ చంద్రగ్రహణం : శ్రీవారి ఆలయం మూసివేత

శుక్రవారం, 27 జులై 2018 (10:18 IST)
సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఇందులోభాగంగా, గురువారం మధ్యాహ్నం నుంచే క్యూలైన్లలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. ఈ శతాబ్దిలోనే సుదీర్ఘ చంద్రగ్రహణం ఆవిష్కృతంకానుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. చంద్రగ్రహణంతో శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
 
అలాగే అన్నప్రసాదం, లడ్డూ వితరణ కేంద్రం కూడా మూసివేయనున్నారు. దాంతో శుక్రవారం వృద్ధులు, వికలాంగులకు దర్శనాలను రద్దు చేశారు. ఆలయశుద్ధి, పుణ్యావచనం తర్వాత శనివారం ఉదయం 4.30 గంటలకు తిరిగి శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు ఆలయాన్ని తెరవనున్నారు. ఆ తర్వాత సర్వదర్శనం కోసం భక్తులను అనుమతిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు