తిరుమలలో పల్లవోత్సవం, 30సంవత్సరాల తరువాత...

గురువారం, 29 జులై 2021 (23:11 IST)
తిరుమలలో పల్లవోత్సవం వేడుకగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టిటిడి పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్రదీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేసి మైసూర్ సంస్ధానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.
 
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్ధానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైసూర్ ప్యాలెస్ మహారాణి ప్రమోదాదేవి వడయార్ 30యేళ్ళ తరువాత ఈ పల్లవోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
 
ఎంతో వేడుకగా కార్యక్రమం జరిగింది. అధికసంఖ్యలో భక్తులు పల్లవోత్సవాన్ని తిలకించారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరిస్తూనే టిటిడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కోవిడ్ తగ్గుముఖం పడుతుండడంతో తిరుమలలో స్వామివారికి సంబంధించిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు