బండవేషంతో తిరుపతి గంగమ్మకు మ్రొక్కులు

గురువారం, 12 మే 2016 (09:43 IST)
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా రెండో రోజు భక్తులు బండవేషంలో అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఏడురోజుల పాటు వివిధ వేషధారణలతో అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. గురువారం ఉదయం నుంచి ఆలయంలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. శరీరమంతా ఎర్రనిబొట్లు, నలుపు బొట్లు, తెల్లని పుష్పాలతో కూడిన మాలలు శిరస్సుకు చుట్టుకుని, చేతిలో కర్రను ధరించి వివిధ గ్రామీణ వాయిద్యాల సహకారంతో లయబద్ధంగా అడుగులు వేస్తూ ఆలయానికి చేరుకుంటున్నారు.
 
బుధవారం భక్తులు బైరాగివేషంను ధరించిన విషయం తెలిసిందే. శుక్రవారం తోటివేషం, 14వ తేదీ దొరవేషం, 15వ తేదీ మాతంగి వేషం, 16వ తేదీ సున్నపు కుండల వేషధారణల్లో భక్తులు కనిపించనున్నారు. 18వ తేదీ విశ్వరూప దర్శన జాతరలోనే ప్రధాన ఘట్టం. 

వెబ్దునియా పై చదవండి