తోటివేషంలో తిరుపతి గంగమ్మకు భక్తుల మొక్కులు

శుక్రవారం, 13 మే 2016 (12:35 IST)
తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా మూడో రోజైన శుక్రవారం భక్తులు తోటివేషంలో పట్టణ వీధులలో సందడి చేస్తున్నారు. శరీరమంతా నల్లని బొగ్గుపొడి పూసుకుని, తెల్లని నామం దిద్ది, కనుబొమ్మలపైన చుక్కలు పెట్టుకుని ఆలయాలకు చేరుకుని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. 
 
చిన్నపిల్లలైతే మీసాలు ధరించి, తలకు వేపాకు మండలను చుట్టుకుని, పాత పొరక చేత పట్టుకుని వీధుల్లో తిరుగుతూ సందడి చేస్తున్నారు. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు వేషధారణలతో ఆలయానికి అధికసంఖ్యలో చేరుకుంటున్నారు.
 
ఈ జాతరలో భాగంగా శనివారం దొరవేషం, ఆదివారం మాతంగి వేషం, సోమవారం సున్నపు కుండలు, మంగళవారం ప్రధాన జాతర జరుగనుండగా 18వతేదీ విశ్వరూప దర్సనం కొనసాగనుంది. 

వెబ్దునియా పై చదవండి