శ్రీవారి ప్రసాదం ధర పెంపుపై వెనక్కి తగ్గిన తితిదే (Video)

ఆదివారం, 17 నవంబరు 2019 (13:10 IST)
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదమైన లడ్డూ ధర పెంపుపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెనక్కి తగ్గింది. శ్రీవారి ప్రసాదమైన లడ్డూ ధరను పెంచబోవడం లేదని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 
 
ఆయన ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని చెన్నైకు శనివారం తిరిగివచ్చారు. ఆయన్ను చెన్నైలోని ప్రముఖ సామాజిక సేవా సంస్థ ఉంగలుక్కాక చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ సునీల్‌ సాదరస్వాగతం పలికారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లడ్డూ ధరను సవరించడం లేదని, ప్రస్తుతం కొనసాగుతున్న విధానంలోనే లడ్డూల విక్రయాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. 
 
కాగా, గత వారంలో టీటీడీ అధికారులు సమావేశమై, ప్రస్తుతం రూ.25గా ఉన్న లడ్డూ ధరను రూ.50కి పెంచాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ధర పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు