జమ్మూ, వారణాసిలో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు టీటీడీ పాలకమండలి నిర్ణయించిందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. శుక్రవారం ఆయన తిరుమలలో మాట్లాడుతూ, జమ్మూ ప్రభుత్వం ఏడు ప్రాంతాలను ప్రతిపాదించిందన్నారు. నాలుగు ప్రాంతాలు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించామన్నారు.
ఈ ఏడాదిలోనే జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. ఈ ఆలయం కూడా ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలో ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, జనవరిలో స్వామివారిని 22.9 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. 1.01 కోట్ల లడ్డు ప్రసాదం విక్రయించామన్నారు. జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.94.9 కోట్లు సమకూరినట్లు పేర్కొన్నారు.