రథసప్తమి వేడుకలకు సిద్ధమవుతోన్న టీటీడీ

బుధవారం, 29 జనవరి 2020 (20:28 IST)
ఫిబ్రవరి 1న రథసప్తమి పర్వదినం కోసం తిరుమలలో విసృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఆ రోజున పెద్ద ఎత్తున తరలివచ్చే యాత్రికులకు అన్ని వసతులు కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. భక్తజనానికి మూలమూర్తి దర్శనం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఫిబ్రవరి 1న అన్ని రకాల ఆర్జిత సేవల రద్దుతో పాటు... ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు