అజ్ఞాత భక్తుడు భారీ కానుక... తిరుమల శ్రీవారికి రూ. 40 లక్షల ఆభరణాల బహూకరణ

గురువారం, 19 మే 2016 (12:00 IST)
తిరుమల శ్రీవారికి ఆభరణాలకు కొదవలేదు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కానుకలను సమర్పిస్తూనే ఉన్నారు. తాజాగా ఒక అజ్ఞాత భక్తుడు తిరుమల శ్రీవారికి 40 లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలను సమర్పించాడు.


గురువారం ఉదయం విఐపి విరామ దర్శనా సమయంలో స్వామి వారిని దర్శించుకున్న భక్తుడు ఆలయంలోని తితిదే ఉన్నతాధికారులకు ఆభరణాలను అందజేశారు. అయితే తన పేరును మాత్రం వెల్లడించవద్దని భక్తుడు తితిదేని కోరారు.

వెబ్దునియా పై చదవండి