Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

సెల్వి

మంగళవారం, 22 జులై 2025 (11:35 IST)
Lights
దీపాల వెలుగులు ఇంటిలోని ప్రతి ఒక్కరిలో మానసిక ప్రశాంతతను పెంచి జీవితంలోని బాధలను దూరం చేస్తాయట. వాస్తు ప్రకారం, ప్రకృతిలోని ఐదు అంశాలలో అగ్ని ఒకటి. దీపం వెలిగించినప్పుడు, అగ్ని శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీంతో ఇది వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా, స్వచ్ఛత, సానుకూల శక్తిని కూడా తీసుకొస్తుందంట. 
 
అదే విధంగా జ్యోతిషశాస్త్రం ప్రకారం దీపం వెలిగించడం వల్ల రాహువు, శని వంటి గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని, బృహస్పతి లేదా సూర్యుడి వంటి గ్రహాలు సానుకూల ప్రభావాలను పెంచుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
నూనె దీపానికి మన పరిసరాలకు వెలుగు, అందం ఇవ్వడానికి మించిన ప్రయోజనాలు ఉన్నాయి. నూనె దీపంతో మీరు మీ గృహంలో  సానుకూల శక్తినీ, పరిసరాలనూ, వాతావరణాన్నీ ఎలా సృష్టించుకోవచ్చు. 
 
ఒక దీపాన్ని వెలిగించినప్పుడు, అది దృశ్య పరంగానే కాకుండా, శక్తి పరంగా కూడా పూర్తి ప్రదేశాన్ని ఒక భిన్నమైన శక్తితో నింపుతుందన్న అవగాహన నుండి ఈ ఆచారం వచ్చింది. ప్రత్యేకించి నువ్వుల నూనె, ఆముదం లేదా నెయ్యి, ఒక అనుకూల శక్తిని వెలువరిస్తాయి. ఆ శక్తికి దాని స్వంత శక్తి క్షేత్రం ఉంటుంది.
 
వాస్తు ప్రకారం, దీపం వెలిగించడానికి ఉత్తమ దిశలు తూర్పు లేదా ఈశాన్య దిశలు. ఇది మీకు ఆనందం, శ్రేయస్సు,  ఆరోగ్యాన్ని తెస్తుంది. దీపాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. నెయ్యి లేదా నూనెతో నింపాలి. దీపం కూర్చుని ధ్యానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు