శ్రీవారి నగలెక్కడ? అలా చేసివుంటే వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చేసే సాహసం చేసేవారా?

సోమవారం, 3 సెప్టెంబరు 2018 (14:43 IST)
తిరుమల కొండపై వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చేసే సాహసం చేసేవారుకాదని సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు వ్యాఖ్యానించారు. తిరుమల కొండపై ఉన్న ఆలయాలను ప్రాచీన కట్టడాలుగా ప్రకటించి ఉంటే, వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చేసే సాహసం చేసేవారు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
 
అంతేకాకుండా, విజయనగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు 16వ శతాబ్దంలో తిరుమల శ్రీవారికి సమర్పించిన అత్యంత విలువైన ఆభరణాలు ఎక్కడున్నాయో చెప్పాలని కోరారు. ఈ మేరకు కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ) ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ), కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రప్రదేశ్‌ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని(టీటీడీ) ప్రశ్నించింది. 
 
తిరుమల ఆలయాలను ప్రాచీన కట్టడాలుగా ప్రకటించడానికి, శ్రీవారి ఆభరణాలను పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు తెలియజేయాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని(పీఎంఓ) ఆదేశించింది. అదేవిధంగా శ్రీవారి ఆలయాలు, ఆభరణాల పరిరక్షణ విషయంలో జస్టిస్‌ వాద్వా, జస్టిస్‌ జగన్నాథరావు కమిటీలు ఇచ్చిన నివేదికలను ఇప్పటిదాకా ఎందుకు బహిర్గతం చేయడం లేదని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డును ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు