గణతంత్ర భారతావని త్రివిధ దళ సంపత్తి

భారతదేశం 58వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనుంది. ప్రపంచ దేశాల్లో జనాభా కలిగిన రెండో అతిపెద్ద దేశంగా భారత చరిత్ర సృష్టించింది. వైశాల్యంలో ఏడోది అయిన.. భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగిన దేశాల్లో ఒకటిగా పేరొందింది. అంతేకాకుండా అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశంగా అవతరించి, ఆసియా ఖండంలో అతిముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించింది. పాకిస్తాన్, చైనా, మియాన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. అలాగే శ్రీలంక, మాల్దీవులు మరియు ఇండోనేసియాలు భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు.

గణతంత్ర దేశంగా అవతరించిన భారతదేశ రక్షణకు త్రివిధ దళాలు తమ సేవలను అందిస్తున్నాయి. భారత రక్షణ శాఖ, నావికాదళం, వైమానిక దళాలు దేశ రక్షణలో నిమగ్నమై శత్రుదేశాల నుంచి తలెత్తే ముప్పును ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. భారత్ తన సైనిక సంపత్తిలో ఎన్నో అస్త్రశస్త్రాలను సమకూర్చుకుంది. మారుతున్న సాంకేంతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ.. తదనుగుణంగా రక్షణ శాఖలో మార్పులు చేస్తూ ముందుకుసాగుతోంది. ఈ 58 ఏళ్ళ గణతంత్ర భారతావనిలో పొరుగు దేశాలతో భారత్ పలుమార్లు యుద్ధాలు చేసి, విజయబావుటా ఎగురవేసింది.

ముఖ్యంగా.. జమ్మూ-కాశ్మీర్ లడక్ ప్రాంతంలో ఉన్న కార్గిల్ పర్వత ప్రాంతాన్ని చేజిక్కించుకున్న పాకిస్తాన్ సైనికులను తరిమికొట్టిన భారత యుద్ద వీరులు విజయానికి నేటితో ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకుని, ఆ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు యావద్భారతావని శ్రద్ధాంజలి ఘటించింది. అలాగే.. టిరాస్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న స్మారక చిహ్నానికి వేలాది మంది సైనికులు అంజలి ఘటించారు. భారత సైనిక ఉపాధ్యక్షుడు ఓపీ నాందరాజోక్ పూలగుచ్చాన్ని ఉంచి సెల్యూట్ చేశారు. భారత యుద్ధ చరిత్రలో ముఖ్యమైనదిగా కార్గిల్ యుద్ధం ప్రత్యేక స్థానాన్ని పొందింది.

కార్గిల్ శిఖరాన్ని తిరిగి సొంతం చేసుకునేందుకు జరిపిన "ఆపరేషన్ విజయ్" విజయవంతంగా పూర్తి చేశారు. భారత సైన్యంలో మూడో విభాగానికి చెందిన సైనికులు ఈ యుద్ధంలో వీరమరణం చెందారు. అంతేకాకుండా.. భారత వైమానికదళంలో.. సూర్యకిరణ్, మిగ్-27, ఎస్‌యూ-30, మిగ్-25, మిగ్-23, జగూర్, బోయింగ్, ఛీటా, ఎల్సీఏ, వంటి అస్త్రాలు భారత వైమానిక అమ్ముల పొదిలో ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి